హలో ఏపీ వార్తలు: ఆంధ్ర ప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతుంది. చీరాలలో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ తేలడంతో వారితో కాంటాక్ట్ అయిన వారిని అధికారులు జల్లెడపడుతున్నారు. వారి వెంట ఢిల్లీకి వెల్లిన బృందం సభ్యులను కనుగొనేందుకు జల్లెడ పడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికి చీరాల, పేరాలలో ఇద్దరు, చీమకుర్తిలో ఒకరు, కందుకూరులో నలుగురు, కనిగిరిలో 7 మంది, వెలిగండ్లలో ఒకరిని గుర్తించినట్టు అధికారులు చెప్పారు.
అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ లో నిర్వహించిన మత ప్రార్ధన కార్యక్రమానికి హాజరు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారందరినీ క్వారంటైన్ వార్డ్ లకు తరలించేందుకు సిద్దమవుతున్నట్టు వైద్యులు తెలిపారు.
@ Hello AP, 29 March 2020