ఏపీలో అక్కడక్కడ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రంగా ఎండ

అమరావతి, ఆంధ్ర ప్రదేశ్: ఏపీలో వాతావరణం అనిశ్చితంగా ఉంది. కేరళ నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకు ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తర కోస్తాలో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి.

రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

కర్నూలులో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత మరింత కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

  • హలో ఏపీ , 29 మార్చి 2020