29 మార్చి 2020 – ముఖ్య వార్తలు తెలుగులో చదవండి.
కరోనా విపత్తులో నిరుపేద కుటుంబాలకు రేషన్‌తో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రోజూ ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ చేయనుంది.
అలాగే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఏప్రిల్ ఒకటినే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయనుంది.
ఏప్రిల్ 4న ప్రతి నిరుపేద కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున నగదు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం.
తెలంగాణ:
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరింది. శనివారం ఒక్కరోజే తెలంగాణలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్:
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. శనివారం ఒక్కరోజే ఏపీలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..
జాతీయం:
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 933కి చేరింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య 21కి చేరింది..
అంతర్జాతీయం
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 31 వేలకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,62,674 చేరింది.
అమెరికాలో శనివారం ఒక్క రోజే 19,187 కరోనా కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,23,313 చేరింది.