ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇండియన్ బౌలర్ అరుదైన రికార్డు సృష్టించాడు. 39 ఏళ్ల కిందట ఇండియన్ బౌలర్ దిలీప్ దోషి నెలకొల్పిన రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. ఈఏడాది మొదట్లో టెస్ట్ క్రికెట్లోకి వచ్చిన బుమ్రా ఇప్పటికి 45 వికెట్లు తీశాడు. తద్వారా టెస్టుల్లోకి ప్రవేశించిన మొదటి ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో బుమ్రా దెబ్బకు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టాడు. 1979లో టెస్టుల్లోకి వచ్చిన దిలీప్ దోషి ఆ ఏడాది 40 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల తర్వాత జస్ప్రిత్ బుమ్రా ఈ రికార్డును బద్దలుకొట్టాడు.
బుమ్రా తర్వాత స్థానాల్లో వెంకటేశ్ ప్రసాద్ (37 వికెట్లు), నరేంద్ర హిర్వాణీ (36), శ్రీశాంత్ (35 వికెట్లు) ఉన్నారు. బుమ్రా బౌలింగ్‌కు ఆసీస్ మాజీ స్టార్ ఆటగాళ్లు కూడా అభిమానులయ్యారు. అంతేకాదు.. ఆమధ్య హీరోయిన్ రాశీ ఖన్నాతో బుమ్రా డేటింగ్‌లో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. బుమ్రా కోసమే తాను క్రికెట్ మ్యాచ్‌లు చూస్తానని రాశీ ఖన్నా కూడా వ్యాఖ్యానించింది.