తెల్లాపూర్‌లో మై హోమ్ భారీ ప్రాజెక్టు.. అంకుర‌

మై హోమ్ గ్రూప్ హైదరాబాద్ లో భారీ రెసిడెన్షియ‌ల్ ప్రాజెక్టును ప్రారంభించ‌నుంది. హైద‌రాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన మై హోమ్ తెల్లాపూర్ స‌మీపంలో మై హోమ్ అంకుర పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించ‌నుంది. ఇది పూర్తిగా హై ఎండ్‌ విల్లా ప్రాజెక్టు. కొద్ది నెల‌ల్లో
అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

మొత్తం ప్రాజెక్టు 400 ఎకరాలలో ఉంటుంది. మై హోమ్ గ్రూప్‌కు తెల్లాపూర్‌, వెలిమెల‌, కొల్లూరు ప్రాంతాల్లో భారీగా భూములు ఉన్న‌ట్టు స‌మాచారం. మై హోమ్ అంకుర మొదటి దశ 73 ఎకరాలలో ఉంటుంది. మొత్తం విల్లాస్ 639. ఇవి హై ఎండ్ సదుపాయాలతో ఉన్న G + 3 విల్లాస్. విల్లా ధరలు ఇంకా వెల్లడించలేదు.

మై హోమ్ ప్రాజెక్ట్ శిల్పా డ్రీం వ్యాలీ ప్రాజెక్ట్ లేఅవుట్ పక్కన ఉంది. రేడియల్ రోడ్ 7 (RR 7) శిల్పా లేఅవుట్ ద్వారా వెళుతుంది. మై హోమ్ అంకుర పూర్తి వివ‌రాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

సర్వే నెంబ‌ర్లు:

ప్రాజెక్ట్ దశ 1: 73.03 ఎకరాలు (2,95,538.52 Sq.m)
సర్వే నం: 240,207, 208, 210-213
చిరునామా: తెల్లాపూర్ గ్రామం, రామచంద్రపురం మండల్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
విల్లాస్ సంఖ్య: 639 (G + 3 అంతస్తులు + టెర్రాస్‌) + అమెనిటీస్ బ్లాక్ (G + 4 అంతస్తులు).