ఆ 300 మంది తీవ్ర‌వాదుల శవాలు ఏవీ?

బాలాకోట్‌లో భార‌త వాయుసేన దాడిలో 300కుపై తీవ్ర‌వాదులు చ‌నిపోయి ఉంటార‌ని భార‌త్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దాని త‌ర్వాత పాకిస్తాన్ ప్ర‌తిదాడికి దిగ‌డం, మ‌న విమానాలు తిప్పికొట్ట‌డం, అభినంద‌న్ పాకిస్తాన్ సైన్యానికి దొర‌క‌డం, విడుద‌ల‌… ఇవ‌న్నీ ఒక‌దానివెంట మ‌రొక‌టి చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. కానీ చాలా మందిని వేధిస్తున్న ప్ర‌శ్న‌… భార‌త వైమానిక దాడిలో చ‌నిపోయిన‌ట్టుగా చెబుతున్న తీవ్ర‌వాదుల శ‌వాలు ఏమ‌య్యాయి? 300 మందికిపైగా చ‌నిపోతే క‌నీసం ఒక్క శ‌వ‌మైనా క‌నిపించ‌కుండా ఎలాపోతాయి? దాడులను వీడియో తీసిన‌ట్టే దాడి త‌ర్వాత …

ఆ 300 మంది తీవ్ర‌వాదుల శవాలు ఏవీ? Read More »

జెర్సీతో మ‌రో క‌న్న‌డ భామ‌.. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌

అనుష్క త‌ర్వాత తెలుగు తెర‌పైకి మ‌రో క‌న్న‌డ భామ దూసుకొస్తోంది. ఆమె శ్ర‌ద్ధా శ్రీనాథ్‌. నాని న‌టిస్తున్న జ‌ర్సీ సినిమాతో శ్ర‌ద్ధా హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానుంది. ఇప్ప‌టికే క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాళ సినిమాల్లో న‌టించిన శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఇక తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అందంతో క‌నువిందు చేయ‌నుంది. తెలుగులో స‌మంత అక్కినేని చేసిన యూ ట‌ర్న్ సినిమాను అంత‌కుముందే క‌న్న‌డ‌లో తీశారు. అందులో స‌మంత పాత్ర చేసింది శ్ర‌ద్ధానే కావ‌డం విశేషం. అందుకే జెర్సీ …

జెర్సీతో మ‌రో క‌న్న‌డ భామ‌.. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ Read More »

మ‌హానాయకుడు మెప్పిస్తాడా…?

ఎన్టీఆర్ – మ‌హానాయ‌కుడు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. తొలిభాగం క‌థానాయ‌కుడు అనుకున్నంత హిట్ కాక‌పోవ‌డంతో రెండో భాగంలో చిత్ర బృందం మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు క‌నిపిస్తుంది. తొలిభాగంలో మిస్స‌యిన భావోద్వేగ స‌న్నివేశాల‌ను రెండో భాగంలో పెట్టిన‌ట్టు స‌మాచారం. మ‌హానాయకుడు ట్రైల‌ర్ చూస్తే ఇదే అర్థ‌మవుతుంది. రెండో భాగంలో డ్రామా పాళ్లు బాగా ఉండే అవ‌కాశం ఉంది. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితం అంద‌రికీ ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మే. అనేక ఉద్వేగాలు, వివాదాలు, సంచ‌నాల‌కు నిల‌యంగా ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితం కొన‌సాగింది. అధికారంలోకి …

మ‌హానాయకుడు మెప్పిస్తాడా…? Read More »