హ‌ర్మ‌న్ ప్రీత్‌… వ్య‌వ‌హారం ఇంత‌టితో ఆపేస్తే మంచిది

మ‌హిళా క్రికెట్ టీమ్‌లో మిథాలీ – హ‌ర్మ‌న్ ప్రీత్ మ‌ధ్య వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. హ‌ర్మ‌న్ ప్రీత్‌, స్మృతి మంధాన బీసీసీఐకి లేఖ రాయ‌డం, అందులో మాజీ కోచ్ ర‌మేష్ పొవార్‌నే కొత్త కోచ్‌గా కొన‌సాగించాల‌ని కోర‌డం కొత్త వివాదానికి దారితీసింది. దీనివ‌ల్ల క్రికెట్‌లో ఆట‌గాళ్ల‌కంటే కోచ్‌ల‌కు అన‌వ‌స‌రంగా అధిక ప్రాధాన్యం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని సీనియ‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. మాజీ క్రికెట‌ర్‌, కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. ర‌మేష్ పొవార్ మంచి …

హ‌ర్మ‌న్ ప్రీత్‌… వ్య‌వ‌హారం ఇంత‌టితో ఆపేస్తే మంచిది Read More »

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యే అవ‌కాశం ఉందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అయిన‌ప్ప‌టికీ బాగా పాపుల‌ర్ నాయ‌కుడు రేవంత్ రెడ్డ‌నే చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ‌లోని ఏ స‌మ‌స్య మీదైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌టం, గ్రామీణ ప్రాంత ప్ర‌జల‌కు కూడా బాగా అర్థ‌మయ్యే రీతిలో విష‌యాల‌ను చెప్ప‌డం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక‌త‌. రేవంత్ రెడ్డి ఎప్ప‌టికైనా సీఎం అవుతాడ‌ని ఆయ‌న అభిమానుల ఆశ‌, ఆకాంక్ష‌. అయితే రేప‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా అంటే, ఏదో అద్భుతం జ‌రిగితే …

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యే అవ‌కాశం ఉందా? Read More »

గుంటూరు జిల్లాలో టీడీపీకి మ‌రో ఎమ్మెల్యే షాక్ త‌ప్ప‌దా?

ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే రావెల్ కిషోర్‌బాబు బాట‌లోనే మ‌రో ఎమ్మెల్యే న‌డుస్తున్న‌ట్టు గుంటూరు జిల్లాలో వ‌దంతులు ఊపందుకున్నాయి. టీడీపీకి గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి రాజీనామా చేసే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వ‌ర్గం వారు నిర్వ‌హించిన కార్తీక వ‌న మ‌హోత్స‌వంలో మోదుగుల చేసినట్టుగా చెబుతున్న‌ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో, తెలుగుదేశం పార్టీ స‌ర్కిళ్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తెలుగుదేశంలో పార్టీలో త‌న ప‌రిస్థితి ప‌ట్ల ఏమాత్రం సంతృప్తిగా లేన‌ట్టు మోదుగుల ఆ స‌మావేశంలో వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. …

గుంటూరు జిల్లాలో టీడీపీకి మ‌రో ఎమ్మెల్యే షాక్ త‌ప్ప‌దా? Read More »