జగన్ టీమ్‌లో డిప్యూటీ సీఎంలు ఎవరు?
ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు ఇంకా వారం రోజులు టైముంది. అయితే మంత్రివర్గంలో ఎవరుంటారు, డిప్యూటీ సీఎం పదవులు ఉంటాయా, ఉంటే ఎవరికి ఇస్తారు… ఇలా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. పదేళ్ల నుంచి జగన్‌తో నడుస్తున్న సీనియర్ నాయకులతోపాటు, జగన్‌కు నమ్మకంగా ఉండే యువ నాయకులు కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారే. కాంగ్రెస్ నుంచి జగన్ బయటికొచ్చి పార్టీ పెట్టినప్పుడు ఆయన …