మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ లేక‌పోవ‌డానికి అదే కార‌ణ‌మా?

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసి 20 రోజులయింది. ఆరోజు కేసీఆర్‌తోపాటు హోం శాఖ‌, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా మ‌హ‌మూద్ అలీ ఒక్క‌రే ప్ర‌మాణం చేశారు. త్వ‌ర‌లోనో క్యాబినెస్ విస్త‌ర‌ణ ఉంటుందిలే అనుకున్నారు అంతా. కానీ ఇద్ద‌రు మంత్రుల‌తోనే తెలంగాణ‌లో పాల‌న న‌డుస్తోంది. మిగ‌తా మంత్రివ‌ర్గం ఎప్పుడు ఉండొచ్చ‌నే దాని గురించి టీఆర్ఎస్ నాయకుల్లో ర‌కార‌కాల ఊహాగానాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్య‌మైన వాద‌న‌, కార‌ణం… మంచి రోజులు లేక‌పోవ‌డం. కేసీఆర్‌కు ముహూర్తాలు, శ‌కునాలు అంటే …

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ లేక‌పోవ‌డానికి అదే కార‌ణ‌మా? Read More »

కేసీఆర్ – హరీష్ రావు మ‌ధ్య పెరుగుతున్న దూరం

కాళేశ్వ‌రం ప్రాజెక్టును, హ‌రీష్ రావును విడ‌దీసి చూడ‌లేం. టీఆర్ఎస్ – 1 ప్ర‌భుత్వంలో నీళ్ల మంత్రిగా ఉంటూ ఆ ప్రాజెక్టుకు హ‌రీష్ రావు పెట్టిన శ్ర‌ద్ధ అలాంటిది. ప్రాజెక్టు అమ‌ల్లో అడుగ‌డుగునా ఇంజ‌నీర్ల‌కు, వ‌ర్క‌ర్ల‌కు మార్గ‌నిర్దేశం చేయ‌డ‌మే కాదు, కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించారు. టీఆర్ఎస్ – 2 హ‌యాంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా నీటి పారుద‌ల ప్రాజెక్టుల బాట ప‌ట్టారు. ఇందులో భాగంగా కాళేశ్వ‌రం కూడా సంద‌ర్శించారు. ఇత‌ర ప్రాజెక్టులూ చూస్తున్నారు. …

కేసీఆర్ – హరీష్ రావు మ‌ధ్య పెరుగుతున్న దూరం Read More »

మోదీకి జ్ఞానోద‌యం అయిన‌ట్టేనా…?

కాంగ్రెస్ ముక్త్ భార‌త్ ల‌క్ష్యంగా 2014లో ప్రారంభించిన బీజేపీ గెలుపుయాత్ర‌కు 2018లో చాలా బ్రేకులు ప‌డ్డాయి. ల‌క్ష్యం కాంగ్రెసే అయిన‌ప్ప‌టికీ, లోలోప‌ల ప్రాంతీయ పార్టీల ప‌ట్ల కూడా బీజేపీకి చిన్న‌చూపే ఉంది. దాదాపు 300 సీట్ల‌తో బీజేపీకి 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌డంతో ఎవ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేక‌పోయినా ఎన్డీఏ పేరుతోనే ప్ర‌భుత్వం న‌డుపుతోంది. కానీ భాగ‌స్వామ్య ప‌క్షాల ప‌ట్ల బీజేపీ వైఖ‌రి మొద‌టి నుంచీ తేడాగానే ఉంది. వాళ్లుకూడా స‌మ‌యం కోసం చూశారు త‌ప్ప‌, …

మోదీకి జ్ఞానోద‌యం అయిన‌ట్టేనా…? Read More »