యాంక‌ర్‌ శ్వేతా రెడ్డికి కేఏ పాల్ ఝ‌ల‌క్‌

హిందూపురం నుంచి బాల‌కృష్ణ మీద పోటీ చేయ‌డానికి సిద్ధ‌మైన జ‌ర్నలిస్టు, యాంక‌ర్‌ శ్వేతారెడ్డికి ప్ర‌జా శాంతి పార్టీ అధినేత, మ‌త ప్ర‌చార‌కుడు కేఏ పాల్ ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇటీవ‌లే కేఏ పాల్ నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో శ్వేతారెడ్డి కూడా పాల్గొంది. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన సంభాష‌ణ‌లో శ్వేతారెడ్డిని పార్టీలోకి కేఏ పాల్ ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఏకంగా బాల‌కృష్ణ మీద పోటీ చేయ‌డానికి హిందూపురం టికెట్ కూడా ఇచ్చిన‌ట్టు శ్వేతా రెడ్డి ప్ర‌చారం చేసుకున్నారు.

swetha reddy you tuber

అలా రెండ్రోజులు గ‌డిచాయో లేదో కేఏ పాల్ విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడుతూ… ఆ అమ్మాయి మ‌ళ్లీ త‌ర్వాత క‌నిపించ‌లేద‌ని వ్యాఖ్యానించాడు. దీంతో శ్వేతారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి పాల్‌ను విమ‌ర్శించింది. నేను తెలంగాణ‌, ఏపీలోనే ఉంటాన‌ని, ఎక్క‌డికీ వెళ్ల‌ల‌నీ చెప్పింది. త‌న‌ను పాల్ ఒక కామెడీ పీస్ లాగా వాడుకోవాల‌ని చూశాడ‌ని వ్యాఖ్యానించింది. దీంతో ప్ర‌జా శాంతి పార్టీ ద్వారా శ్వేతారెడ్డి రాజ‌కీయ అరంగేట్రం లేన‌ట్టే.