అమృత, ప్రణయ్‌ల ప్రేమ ప్రయాణం అందరికీ గుర్తుండే ఉంటుంది. కులాంతర వివాహం చేసుకున్న అమృత భర్త ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు హత్య చేయించడం దాదాపు నాలుగు నెలల కిందట తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. మిర్యాలగూడకు చెందిన అమృత కుటుంబం గురించి అప్పట్లో చాలా చర్చ జరిగింది.
ప్రణయ్ హత్య సమయంలో అమృత గర్భవతి. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆసుపత్రికి వెలుతున్న సమయంలోనే ప్రణయ్ హత్య జరిగింది. నిన్న అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది అమృతకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంకొంచెం ముందుకెళ్లి కొంతమంది ప్రణయ్ మళ్లీ పుట్టాడని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రణయ్ మృతి తర్వాత అమృతను అబార్షన్ చేయించుకోమని, మళ్లీ పెళ్లిచేసుకోమని అనేక మంది సలహాలు ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. అమృత వీటిని కొట్టిపారేసింది. పుట్టబోయే బిడ్డలోనే ప్రణయ్‌ను చూసుకుంటానని అప్పట్లో అనేకసార్లు చెప్పింది.