ఛలో, గీత గోవిందం సినిమాలు మంచి హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో రష్మికకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ట్విట్టర్లో 3 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారంటే రష్మికకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అయితే రష్మిక నటించిన మొదటి తెలుగు సినిమా ఛలో దర్శకుడు వెంకీ కుడుముల రష్మికకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ఛలో సినిమా రిలీజై నేటికి ఏడాది అయిన సందర్భంగా ఆ రోజులను, సినిమాకు మంచి టాక్ రావడాన్ని గుర్తు చేసుకుంటూ రష్మికకు ట్వీట్ చేశాడు. ఇదే ఈ ట్వీట్ సారాంశం..
డైరెక్టర్‌గా మీరు నాకు జన్మనిచ్చి నేటికి సంవత్సరం అయింది. మీ వల్లే నా తల్లిదండ్రుల కళ్లలో ఆనందభాష్పాలు చూడగలిగాను. ఛలో సినిమా ద్వారా మంచి అనుభవాలు, పాఠాలు, బలం, సంతోషం, అనుభూతులను ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తర్వాతి సినిమాలో తప్పకుండా మళ్లీ అవకాశం ఇస్తానని హామీఇస్తున్నాను…
దీంతో రష్మిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఛలో ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ… మనం ముందు ముందు ఇంకా అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు రీట్వీట్ చేసింది.