తమిళ హీరో శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. శరత్ కుమార్ కూతులు వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ మధ్యనే తెరంగేట్రం కూడా చేసింది. విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది వరలక్ష్మి. విజయ్ నటించిన సర్కార్ సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
విజయంతోపాటు వరలక్ష్మీ ప్రేమాయణం కూడా బాగా వార్తల్లోకి వచ్చింది. హీరో విశాల్‌తో డేటింగ్ గురించి ఇప్పటికే అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే విశాల్, వరలక్ష్మీ ఇద్దరూ ఆ వార్తలను ఇటీవలే తోసిపుచ్చారు.
ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమానికి హాజరైన వరలక్ష్మీ శరత్ కుమార్ అక్కడ సరదాగా అడిగిన ప్రశ్నలకు అంతే క్రేజీ సమాధానాలు ఇచ్చారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు చూడండి…
ఒకరికి ముద్దివ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు: హీరో శింబుకే
ఎవరినైనా చంపాల్సి వస్తే: ఇంకెవరు విశాల్‌నే..
పెళ్లి చేసుకోవాల్సి వస్తే: ఇంకా స్పష్టత రాలేదు.