తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్ సిద్ధమవుతుందా?
మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడా?
సెలబ్రిటీల ఎంపికలో ఈసారి మా టీవీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ.. రచ్చ.
కొంచెం రియాలిటీ, ఇంకొంచెం డ్రామా, మరికొంచెం గ్లామర్… మొత్తంగా తెలుగు టీవీ షోల్లో హిట్‌గా బిగ్‌బాస్ పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 సీజన్లు విజయవంతంగా పూర్తవడంతో ఇప్పుడు దృష్టంతా సీజన్ 3 మీదే ఉంది. ఎన్టీఆర్ మళ్లీ సీజన్ 3 హోస్ట్‌గా రాబోతున్నాడని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. సీజన్ 1 కంటే సీజన్ 2 పెద్దగా ఆకట్టుకోలేదని, అందుకే మళ్లీ ఎన్టీఆర్ ను మా స్టార్ రంగంలోకి దించుతుందని అనుకుంటున్నారు.
అంతేకాదండోయ్… బిగ్‌బాస్ 3లో పాల్గొనే హౌస్‌మేట్‌ల జాబితా కూడా సిద్ధమైపోయింది. యూట్యూబ్ చానళ్లు, వెబ్‌సైట్లు ఒక జాబితాను సిద్ధం చేసి సర్క్యులేట్ చేస్తున్నాయి. ఇందులో చాలా ఆసక్తికరమైన పేర్లు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. సోషల్ మీడియా కథనాల ప్రకారం బిగ్‌బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ వీరే…
1) రేణూ దేశాయ్ (హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య)
2) గద్దే సింధూర (విజయవాడ హీరోయిన్)
3) శోభిత ధూళిపాల (నటి, మోడల్)
4) వరుణ్ సందేశ్ (కొత్త బంగారులోకం హీరో)
5) ఉదయభాను (టీవీ యాంకర్, హీరోయిన్)
6) రఘు మాస్టర్ (డ్యాన్స్ మాస్టర్)
7) హేమచంద్ర (గాయకుడు)
8) పొట్టి గణేష్ (జబర్దస్త్ ఫేమ్)
9) జాకీ (టీవీ నటుడు)
10) చైతన్య కృష్ణ
11) మనోజ్ నందన్
12) కమల్ కామరాజు (హీరో)
13) నాగ పద్మిని (టీవీ యాంకర్)
14) జాహ్నవి (యూట్యూబ్ స్టార్ – మహాతల్లి)