క‌న్నుగీటిన ప్రియా… డ్యాన్సులేసిన స‌ప్నాకే … నెటిజ‌న్ల ఫిదా

ఈ ఫొటో గుర్తుండే ఉంటుంది అంద‌రికీ… ఒకే ఒక్క వీడియోతో కోట్లాడి హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఫొటో ఇది. మ‌ళ‌యాళం సినిమాలో చిన్న పాట ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది వారియ‌ర్‌. ఇప్పుడు ఈమె ప్ర‌స్తావ‌న ఎందుక‌నుకుంటున్నారా? మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది క‌నుక‌నే.

క‌న్నుగీటి స్టార్ అయిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ గురించి అధికంగా వెతికిన నెటిజ‌న్లు

గూగుల్ 2018 సంవ‌త్స‌రానికి టాప్ సెర్చెస్ లిస్ట్ విడుద‌ల చేసింది. అందులో ఈ మ‌ళ‌యాళీ ముద్దుగుమ్మ‌కే ప్ర‌థమ స్థానం ద‌క్కింది. గూగుల్ ఈమె గురించే మ‌న‌దేశంలో ఎక్కువ మంది సెర్చ్ చేశార‌ని గూగుల్ అధికారికంగా వెల్ల‌డించింది. సెల‌బ్రిటీల్లో అగ్ర‌స్థానం ద‌క్కించుకుంది ప్రియా ప్ర‌కాశ్‌.

ఇక రెండో స్థానం కూడా విశేష‌మే. హ‌ర్యాణాకు చెందిన ప్ర‌ముఖ డ్యాన్స‌ర్ స‌ప్నా చౌద‌రి గూగుల్ సెర్చ్‌లో రెండో స్థానం ద‌క్కించుకుంది. మూడో స్థానంలో బాలీవుడ్ న‌టి సోన‌మ్ క‌పూర్ భ‌ర్త ఆనంద్ అహూజా, నాలుగో స్థానంలో ఈ మ‌ధ్యే నిక్ అనే విదేశీ కుర్రాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా నిలిచారు.

త‌న డ్యాన్సుల‌తో హ‌ర్యాణాతోపాటు యూట్యూబ్ సంచ‌ల‌నంగా మారిన స‌ప్నా చౌద‌రి ఇంట‌ర్నెట్ వెతుకులాట పోటీలో రెండో స్థానంలో ఉందని గూగుల్ ప్ర‌క‌టించింది.

సినిమాల విష‌యానికొస్తే… ఎక్కువ‌మంది వెతికింది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ న‌టించిన 2.ఓ గురించే. త‌ర్వాత స్థానాల్లో బాఘీ 2, రేస్ 3 ఉన్నాయ‌ట‌. గుజరాత్‌లో వేల‌కోట్లు పెట్టి క‌ట్టించిన ప‌టేల్ విగ్ర‌హం గురించి కూడా బాగానే వెతికార‌ట నెటిజ‌న్లు.