ఎన్టీఆర్ కథానాయకుడు ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బయటి ప్రసంగాల్లో ఎప్పుడూ భావోద్వేగ పూరితంగా మాట్లాడే ఎన్టీఆర్ ఈసారి తన తాత ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ మరింత భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ ఓ చరిత్ర. విజయవంతమైన చరిత్ర. దానికి విజయాలు, అపజయాలు ఉండవు. చరిత్ర సృష్టించడమే ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు.
ఎన్టీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే చదవండి….
” ఆ మహామనిషి కుటుంబంలోని ఒక కుటుంబసభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. ఒక మహానుభావుడు చేసిన త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా నేను మాట్లాడుతున్నాను. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికీ చెందిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ మహానుభావుడి చరిత్రను మా తరానికి.. ముందు తరాలకు తీసుకెళ్తున్న బాబాయ్ బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా సరిపోదు. మా పిల్లలు తాతయ్య ఎన్టీఆర్ గురించి అడిగితే.. మా తాత గురుంచి మీ తాతయ్య తీసిన చిత్రం ఉందని చూపిస్తా” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
పక్కనే ఉన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ భుజం తట్టారు. జూనియర్ మాట్లాడుతున్నంతసేపు కార్యక్రమానికి వచ్చిన ఎన్టీఆర్, బాలయ్య అభిమానులు, జూనియర్ అభిమానులు ఈలలు, కేకలతో.. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.