ఇటీవలి కాలంలో సోషల్ మీడియా బాగా హల్‌చల్ చేస్తోన్న హీరో ఎన్టీఆర్. ఆమధ్య కొంచెం లావుగా ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అది ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ అనుకున్నారు అందరూ. అది నిజం కాదని తేలింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో తారక్ ఉంటాడా లేదా అనేది కూడా ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. తాజాగా భార్య ప్రణతితో దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎన్టీఆర్ తన సతీమని ప్రణతితో కలిసి ఇటీవల హైదరాబాద్‌లోని ‘ఫస్ట్ ఇంప్రెషన్స్’ అనే సంస్థకు చెందిన భావన జస్రాను కలిశారు. ఎన్టీఆర్ తన కొడుకులు అభయ్‌రామ్, భార్గవ్ రామ్ ఇంప్రెషన్స్ కోసం అక్కడికి వెళ్లారు. టెక్నాలజీ ఆధారంగా వేలి, కాలి ముద్రలు, ఇతర మధుర జ్ఞాపకాల గుర్తులను అచ్చు చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. అక్కడికి వెళ్లిన సందర్భంలో తీసిన ఫొటోలను సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అదే సమయంలో ఎన్టీఆర్ గుబురు గడ్డంతో కనిపించడంతో మళ్లీ అది చర్చకు వచ్చింది. రాజమౌళి సినిమా ఆర్.ఆర్.ఆర్.లో లుక్ కోసమే ఎన్టీఆర్ అలా గడ్డం పెంచారా అంటూ ఊహాగానాలు సాగుతున్నాయి.