నందమూరి, కొణిదెల కుటుంబాల మధ్య పోరు కాస్తా చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య యుద్ధంగా మారుతోంది. ఇటీవల బాలకృష్ణ ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్ కూడా అంతే దుమారాన్ని రేపుతున్నాయి.
బాలకృష్ణ / బాలయ్య ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు మాట్లాడటంపై బాలయ్య / నందమూరి అభిమానులు నాగబాబుపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.
బాలయ్య ఎవరో తనకు తెలియదన్న నాగబాబును యారోగెంట్‌గా బాలయ్య అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. పాత తరం నటుడు బాలయ్య ఒక్కరే తనకు తెలుసని నాగబాబు అన్నారు. మామూలుగా అయితే దీన్ని పెద్దగా పట్టించుకోరుగానీ, బాలకృష్ణ కామెంట్స్ నేపథ్యంలో దీనికి మరింత ప్రాచుర్యం లభించింది.
కొంతకాలం కిందట పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి బాలకృష్ణ రాజకీయాల నేపథ్యంలో ప్రకటనలు చేశాడు. పవన్ కళ్యాణ్ గురించి తనకు తెలియదన్న రీతిలో మాట్లాడాడు. దీనికి ప్రతీకారంగానే నాగబాబు స్పందనను అర్థం చేసుకోవచ్చు.