ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. దీంతో ఆడియో, ట్రయిలర్, పోస్టర్‌ల రిలీజ్‌తో నందమూరి అభిమానుల హడావిడి మొదలైంది. రోజూ ఒక కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈసినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈరోజు ఆడియో, ట్రయిలర్ కూడా హైదరాబాద్‌లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.
తాజాగా నందమూరి బసవతారకరం గెటప్‌లో విద్యాబాలన్, బాలయ్యతో కలిసి ఉన్న ఫొటోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోను నిర్మాతలు రిలీజ్ చేశారు.
మరోవైపు ఆడియో ఫంక్షన్‌ను జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మరింత సందడి నెలకొనే అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో నందమూరి సుహాసిని తరఫున ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ప్రచారం చేయకపోవడం, బాలకృష్ణ మాత్రమే ప్రచారం చేయడం నందమూరి కుటుంబంలో విభేదాల పట్ల కొంత ఊహాగానాలకు తావిచ్చింది.