సూపర్ స్టార్ రజనీ కాంత్, అక్షయ్ కుమార్ నటించిన 2.0 చిత్రం మీద క్రిటిక్స్ మంచి రివ్యూలు ఇచ్చినప్పటికీ వసూళ్లపరంగా చూసే అంత ఊపు లేదని చెప్పాలి. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో సినిమా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో సినిమా బాగా ఉందనే టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం గొప్పగా లేకపోవడంతో పంపిణీదారులు నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో పేలవంగా సినిమా వసూళ్లు ఉన్నాయి.
అయితే కొంచెం ఆలస్యంగానైనా హిందీ వెర్షన్ దుమ్ము దులుపుతోంది. నార్త్ ఇండియా 2.0 అద్భుత కలెక్షన్లు రాబడుతూ చరిత్ర సృష్టిస్తోంది. కరణ్ జోహార్ పంపిణీ హక్కులు తీసుకోవడం, అక్షయ్ కుమార్ నటన ఉత్తరాదిలో మంచి వసూళ్లకు ప్రధాన కారణంగా ట్రేడ్ టాక్. మొత్తం మీద వసూళ్లు బాగున్నప్పటికీ ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారత దేశంలో పంపిణీ దారులకు నిరాశ ఎదురైంది. రజనీ కాంత్ ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ పాపులర్ హీరో కావడం విశేషం.
రజనీకాంత్‌కు చైనాలో, జపాన్‌లో కూడా మంచి అభిమానులు ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చైనాలో కూడా 2.0 ని భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ గత చిత్రాలు ముత్తు, నరసింహ, రోబో, భాషా, తదితర చిత్రాలు చైనా, జపాన్‌లో మంచి వసూళ్లు రాబట్టాయి.