స్నేహ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని హీరోయిన్. తొలివలపు దగ్గర్నుంచి సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు లాంటి అనేక హిట్ సినిమాల్లో నటించి తమిళ దర్శకుడు ప్రసన్నను పెళ్లి చేసుకొని నటన నుంచి విరమించారు. చాలా కాలం తర్వాత వినయ విధేయ రామ సినిమాలో కనిపించి మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రసన్న, స్నేహ మధ్య సంబంధం గురించి స్నేహ ఇటీవల ఓ టాక్‌షోలో ఇలా వివరించారు…
వాస్తవానికి మొదట్లో నాకు, ప్రసన్నకు పడేది కాదు. దాదాపు 15 ఏళ్ల కిందట ప్రసన్న నటిస్తున్న మూవీలో నటించడానికి నేను అనేక కారణాల వల్ల నిరాకరించాను. అప్పట్లో అతను ఎవరో నాకు పెద్దగా తెలియదు. నేను తనతో నటించనన్నానని ప్రసన్న అప్‌సెట్ అయ్యారట. తర్వాత స్నేహ సోదరి ఇళయరాజా ఫ్యాన్ కావడంతో సాంగ్స్ కలెక్షన్ కోసం వెతుకుతుంటే అనుకోకుండా ఎవరో ప్రసన్న పేరు సజెస్ట్ చేశారు. అప్పుడు ప్రసన్నకు కాల్ చేస్తే ఇంతకు ముందు జరిగింది దృష్టిలో ఉంచుకొని తను సరిగా రెస్పాండ్ అవలేదు.
తర్వాత కొన్నాళ్లకు తనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. షూటింగ్ కోసం అమెరికా వెళ్లినప్పుడు కాటేజ్ దగ్గర మాట్లాడాను. అప్పటి నుంచి తనంటే ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత డేటింగ్, పెళ్లి అయిపోయాయి.