జెర్సీతో మ‌రో క‌న్న‌డ భామ‌.. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌

అనుష్క త‌ర్వాత తెలుగు తెర‌పైకి మ‌రో క‌న్న‌డ భామ దూసుకొస్తోంది. ఆమె శ్ర‌ద్ధా శ్రీనాథ్‌. నాని న‌టిస్తున్న జ‌ర్సీ సినిమాతో శ్ర‌ద్ధా హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానుంది. ఇప్ప‌టికే క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాళ సినిమాల్లో న‌టించిన శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఇక తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అందంతో క‌నువిందు చేయ‌నుంది.

తెలుగులో స‌మంత అక్కినేని చేసిన యూ ట‌ర్న్ సినిమాను అంత‌కుముందే క‌న్న‌డ‌లో తీశారు. అందులో స‌మంత పాత్ర చేసింది శ్ర‌ద్ధానే కావ‌డం విశేషం. అందుకే జెర్సీ సినిమాలో శ్ర‌ద్ధా అందం, అభిన‌యంపై అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

బాలీవుడ్‌లో కూడా శ్ర‌ద్ధా ఎంట్రీ అయిపోయింది. మిల‌న్ టాకీస్ అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఇటీవ‌లే దీని ట్ర‌యిల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శ్ర‌ద్ధా శ్రీనాథ్ మ‌రిన్ని రొమాంటిక్ సీన్ల‌లో న‌టించింది. ట్రయిల‌ర్ చూసిన జ‌నం సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.