నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించి నిర్మించిన ఎన్టీఆర్ – కథానాయకుడు బయోపిక్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అమెరికా, ఇతర దేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు, ప్రివ్యూలు చూసినవాళ్లు ఇంటర్నెట్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వీటి సమాహారం ఇక్కడ ఇస్తున్నాం…
1) ఎన్టీఆర్ ఆవేశపూరిత సన్నివేశాల్లో బాలకృష్ణ బాగా నటించారు.
2) రామకృష్ణ మరణం లాంటి భావోద్వేగ సన్నివేశాల్లో నటన అంతకా ఆకట్టుకోలేకపోయింది.
3) అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ జీవించాడు. మేకప్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ అచ్చుగుద్దినట్టు ఏఎన్నార్ మాదిరిగానే ఉంది.
4) ఎన్టీఆర్ – బసవతారకం మధ్య సన్నివేశాలు సినిమాకు లైఫ్‌లైన్ లాంటివి.
5) ఫస్ట్ ఆఫ్ అంతా కొంచెం స్లోగా ఉంది. ఎన్టీఆర్ హిట్ సినిమాల్లోని పాటల చిత్రీకరణ రికార్డింగ్ డ్యాన్సులను గుర్తు చేస్తుంది.
6) సెకండాఫ్‌లో చంద్రబాబు పాత్ర ఎంటర్ అవుతుంది కానీ పెద్దగా ప్రాధాన్యం లేదు.
7) బాలకృష్ణ, సుమంత్ పాత్రలే కీలకం, వీటికే ఎక్కువ ప్రాధాన్యం. మిగతా వన్నీ అలా వచ్చి ఇలా పోయేవే.
8) శ్రియ, హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్‌ల మీద చిత్రీకరించిన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
9) తెలుగుదేశం పార్టీ ప్రకటనతో సినిమా ముగుస్తుంది.
ఎన్టీఆర్ – బసవతారకం వైవాహిక జీవితం గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. అందుకే సినిమాలో ఎక్కువగా దీనిపై ఫోకస్ చేశారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ సత్తా చాటారు. బసవతారకం వైపు నుంచి ఎన్టీఆర్ జీవితం ఎలా ఉంటుందనేది సినిమాలో కీలకంగా చూపించారు. అందుకే సినిమాలో అందరికీ తెలియని ఎన్టీఆర్ జీవితం చాలా ఉంది.