సినిమా తారలు ఓటు వేయడం ఎవరైనా చూశారా? మరీ ముఖ్యంగా హీరోయిన్‌లు ఎప్పుడైనా, ఎక్కడైనా ఓటు వేసినట్టు ఎవరికైనా గుర్తుందా. వేసుంటే మంచిదే. కానీ ఆ మాత్రం చైతన్యం ఉన్న హీరోయిన్లు తక్కువనే చెప్పాలి. కానీ తనకు తొలిసారిగా వచ్చిన ఓటు హక్కును వినియోగించుకుంటానని సినీ నటి యామినీ భాస్కర్ చెబుతున్నారు.
తన తొలి సినిమా కీచక తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు తెలంగాణ రాజకీయాల పట్ల ఆసక్తి ఉందంటున్నారు. తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అని త్వరగా తెలుసుకోవాలని ఉందన్నారు.
పనిలో పనిగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గుడ్.. మంచి సందేశం. అలాగే సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని కూడా సూచించారు. గుడ్ గుడ్… మరీ మంచిది.
అంతేకాదండోయ్. మీకు ఎవరూ నచ్చకపోతే నోటా వాడుకోవాలిగానీ పోలింగ్ కేంద్రానికి మాత్రం వెళ్లాల్సిందే అంటున్నారు యామినీ భాస్కర్. పోలింగ్ రోజు సెలవు ఇస్తారు. అందువల్ల హాలిడే లాగ భావించకుండా బాధ్యతతో ఓటు వేయాలని యామినీ భాస్కర్ కోరారు.