ఇంత‌కంటే గొప్ప ఛాలెంజ్‌లు చాలా ఉన్నాయి: ర‌ష్మీ

అందంతోపాటు బోల్డ్‌నెస్ ఉన్న జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌, న‌టి ర‌ష్మీ గౌత‌మ్ తాజాగా టెన్ ఇయ‌ర్ చాలెంజ్‌పై త‌న అభిప్రాయాల‌ను పంచుకుంది. ఇలాంటి వాటికంటే ప్ర‌పంచంలో, దేశంలో ఇంకా ముఖ్య‌మైన చాలెంజ్‌లు చాలా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించింది. ఇంట‌ర్నెట్‌లో ఇప్పుడు త‌న కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

ర‌ష్మీ గౌత‌మ్ మాట‌లు త‌న ప‌దాల్లోనే…. కికి చాలెంజ్‌, ఐస్ బ‌కెట్ ఛాలెంజ్‌, ఇప్పుడు టెన్ ఇయ‌ర్స్ ఛాలెంజ్‌… రెండ్రోజుల‌కోసారి ఏదో ఒక ఛాలెంజ్ వ‌స్తూనే ఉంది. ఇవేంటో నాకు అర్థం కావ‌డం లేదు. ఏదో ఫ‌న్ ఉంటుంది కానీ ఎప్పుడూ ఇవే ఎందుకు? జీవితంలో ఈ ఛాలెంజ్‌ల కంటే ముఖ్య‌మైన విష‌యాలు చాలా ఉన్నాయి.

rashmi gautham on challenges

గ‌త పదేళ్ల‌లో బ‌రువు త‌గ్గిన ఫొటోలు, పాత‌వి, కొత్త‌వి చాలా చూస్తున్నాను. ప‌దేళ్ల కాలంలో ఎవ‌రూ ఒకేలా ఉండ‌రు. దాన్ని ఎలా ఎదుర్కొంటారు. సోష‌ల్ మీడియా వ్య‌స‌నం మ‌న‌ల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంది. వాస్త‌వ ప్ర‌పంచానికి దూరం చేస్తుంది. నేను కూడా ఓ ఛాలెంజ్ స్టార్ట్ చేయ‌బోతున్నాను. ప‌దేళ్ల కింద‌ట ఎన్ని మొక్క‌లు నాటారు.. ఇప్పుడు వాటితో దిగిన ఫొటోలు షేర్ చేయ‌మ‌ని ఛాలెంజ్ పెడ‌తాను.

గ్లోబ‌ల్ వార్మింగ్ ఇప్పుడు చాలా పెద్ద చాలెంజ్‌. దీని గురించి పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం అవ‌స‌రం అంటోంది ర‌ష్మి. అన్నీ ఒక ఈవెంట్ లాగా చూడ‌టం మానేసి ఆచ‌రించ‌డం నేర్చుకోవాల‌ని చెబుతోంది.