అదే దారిలో ల‌వ‌ర్స్ డే

తెలుగునాట అర్జున్ రెడ్డితో మొద‌లైన సినిమాల ప‌ర్వ‌ర్ష‌న్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. యువ‌త అంటే ప్రేమ‌లు, లిప్‌లాక్‌లు, సిగ‌రెట్లు, మ‌ద్యం అనే అభిప్రాయాన్ని బ‌లంగా చాటుతున్నాయి కొన్ని సినిమాలు. వీట‌న్నిటికీ నేప‌థ్యంగా, బ‌ల‌మైన కార‌ణంగా ప్రేమ‌ను చూపిస్తున్నాయి. తాజాగా ఈ వ‌రుస‌లోకి చేరింది ల‌వ‌ర్స్ డే. మ‌ళ‌యాళం నుంచి దిగుమ‌తి అయిన ఈ సినిమా టీజ‌ర్ చూస్తే ఈ సినిమా ల‌క్ష్యం ఏంటో అర్థ‌మైపోతుంది.

lovers day teaser

అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, ఆ మ‌ధ్య‌లో వ‌చ్చిన వ‌ర్మ సినిమా, పేర్లు కూడా గుర్తుంచుకోవ‌డానికి ప‌నికిరాని మ‌రికొన్ని సినిమాలు ఇటీవ‌ల వ‌చ్చాయి. తొలి రెండు సినిమాలు హిట్ కావ‌డంతో ఇక అంద‌రూ అదే లిప్‌లాక్‌ల బాట ప‌ట్టారు. బ‌య‌ట పోస్ట‌ర్లు, బస్‌స్టాప్‌లు, హోర్డింగ్‌ల మీద అవే బొమ్మ‌లు.

ల‌వ‌ర్స్ డే టీజ‌ర్ చూస్తే… ఇది మ‌రో సాదా సీదా, ప‌ర్వ‌ర్టెడ్ ల‌వ్ స్టోరీ అనిపిస్తుంది. వాళ్ల యూనిఫామ్ చూస్తుంటే కాలేజీ కూడా కాకుండా స్కూలు పిల్ల‌ల్లాగున్నారు. లిప్‌లాక్ ప్రధానంగా ఉన్న సీన్‌ను టీజ‌ర్‌గా రిలీజ్ చేయ‌డంతోటే ఈ సినిమా ఏ స్థాయిలో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక్క‌డ ఈ మాత్రం సినిమాలకు ఏం కొద‌వ లేదు క‌దా. ఇంకా కేర‌ళ నుంచి దిగుమ‌తి ఎందుకు?