వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను అతని ప్రియురాలితో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది భార్య. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వారిద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే… నాగరాజు హైదరాబాద్‌లో టీసీఎస్ కంపెనీలో టీమ్ లీడర్. తన సహోద్యోగి అయిన రాధారాణి అనే యువతి వ్యామోహంలో పడి కొన్నాళ్లుగా భార్యను, కూతురిని దూరంగా పెట్టాడు. తన టీమ్ మెంబర్ రాధారాణితో వేరేచోట నివశిస్తున్నాడు.
అయితే తమను ఇంతకాలం వదిలించుకోవాలని చూసిన భర్త, అతని ప్రియురాలును భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది. మీర్‌పేటలోని ద్వారకా నగర్‌లో వారు ఇద్దరూ దొరికిపోయారు. 2007లో నాగరాజు, అమూల్యకు వివాహం అయింది. వారికి ఎనిమిదేళ్ల పాప కూడా ఉంది. నాగరాజు టీసీఎస్‌లో ఉద్యోగి. తమను వదిలించుకోవడానికి చాలా కాలం నుంచి నాగరాజు ప్రయత్నిస్తున్నాడని, తనకు, తన కూతురికి ప్రాణహాని ఉందని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను కఠినంగా శిక్షించాలని కోరింది.