Telugu News

కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటన

ముఖ్యాంశాలు: కడప నగరంలో విస్తృతంగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా. కడప జడ్పీ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ , మునిసిపల్ మైదానం లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ పరిశీలించిన అంజాద్ బాషా. కరోనా నేపథ్యంలో ప్రజలను పలు సూచనలు. కడప నగరంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటించారు. కూరగాయల కొనుగోలుకు నగరంలోని మార్కెట్లకు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచనలు చేశారు. అంతేగాకుండా కరోనా వైరస్ వ్యాప్తి …

కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటన Read More »

ఏపీలో మరింత కఠినంగా లాక్ డౌన్

అమరావతి: ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో సడలింపు సమయాలను కుదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు దీనివ్యాప్తి విస్తృతంగా ఉండడంతో ఉదయం 6 నుంచి 9 గంటల వరకే లాక్‌డౌన్‌కు వెసులుబాటు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క రైతుబజార్లలోనూ ప్రజల రద్దీ చాలావరకు తగ్గిపోయింది. ప్రజల్లో వైరస్ పట్ల భయం పెరుగుతోంది. దీంతో అందరూ ఉదయమే కూరగాయలు లాంటివి తీసుకొని వెళ్లుతున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉండడం …

ఏపీలో మరింత కఠినంగా లాక్ డౌన్ Read More »

ఏపీలో అక్కడక్కడ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రంగా ఎండ

అమరావతి, ఆంధ్ర ప్రదేశ్: ఏపీలో వాతావరణం అనిశ్చితంగా ఉంది. కేరళ నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకు ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తర కోస్తాలో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు …

ఏపీలో అక్కడక్కడ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రంగా ఎండ Read More »