బయటకు రానున్న బతుకమ్మ చీరలు
ఎన్నికల కోడ్ వల్ల పంపిణీ ఆగిపోయి మూలన పడేసిన బతుకమ్మ చీరలను మళ్లీ దుమ్ము దులిపి బయటకు తీస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో మహిళలు టీఆర్ ఎస్‌కు నీరాజనాలు పట్టడంతో కేసీఆర్ తక్షణం బతుకమ్మ చీరలను మహిళలక పంచాలని ఆదేశాలిచ్చారు. దీంతో తెలంగాణలో మళ్లీ బతుకమ్మ పండగ వాతావరణం నెలకొననుంది. ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. 2017 నుంచి టీఆర్ ఎస్ ప్రభుత్వం బతుకమ్మ …