కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్
తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మరోపార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసే దిశగా ఆపార్టీ అధినేత అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పట్ల టీఆర్ఎస్ వైఖరి చూస్తుంటే ఇది జరగడానికి ఎన్నో రోజులు ఆగాల్సిన పని లేదనిపిస్తుంది. మొదటి నుంచీ 100 సీట్లు లక్ష్యంగా చెబుతున్న టీఆర్ఎస్ ఎన్నికల్లో 100 రాకపోయినా, ఇతర పార్టీల వాళ్లను కూడా కలుపుకొని 100 టార్గెట్ చేరుకునే దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ఎప్పటికైనా తనకు ప్రధాన శత్రువు …