వీ6 వివేక్‌పై వేటు తప్పదా…?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో కోవర్టులుగా వ్యవహరించి సొంత అభ్యర్థుల ఓటమికి కృషి చేసిన నేతలపై టీఆర్ఎస్ దృష్టిపెట్టింది. అలాంటి అభ్యర్థులను ఏదో విధంగా పార్టీలో కొనసాగించడం కంటే వదిలించుకోవడమే మంచిదన్న అభిప్రాయంలో తెరాస అధినేత కేసీఆర్ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఓటమికి అంతర్గత కుమ్ములాటలే కారణమని ఏకంగా ముఖ్యమంత్రే బహిరంగంగా ఒప్పుకున్నారు. దీంతో కోవర్టుల్లో అలజడి మొదలైంది. అయితే పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ / వివేకానంద ఈ గొడవల్లో చిక్కుకున్నారు. విశాఖ ఇండస్ట్రీస్, …