కేసీఆర్ రైతుబంధు కాపీ పథకమే
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుతో కేసీఆర్ పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ విజయంలో రైతుబంధు కీలకమనీ, ఇలాంటి పథకాన్ని దేశంలో ఎక్కడా చూడలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది విశ్లేషించారు. కానీ రైతుబంధు పథకం కేసీఆర్ సొంత ఆలోచన కాదనేది తాజా విశ్లేషణ. దీనికి మూలాలు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడ్డాయని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. కొంచెం లోతుల్లోకి వెళ్లి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్లకు కూడా వై.ఎస్.ఆర్. …