ఓట్లు ఏయించుకున్నరు…. పైసలు ఇయ్యలె
ఖమ్మంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓట్లు వేసిన ప్రజలు ఓటు వేసినందుకు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఓ అభ్యర్థికి చెందిన నాయకుడిని నిలదీశారు. శుక్రవారం ఓటు వేసి పోలింగ్ మరుసటి రోజు శనివారం మొత్తం సదరు నాయకుడి ఇంటి వద్దనే వెయిట్ చేశారు. డబ్బుల ఇస్తానని వాగ్దానం చేసిన నాయకుడు కనిపించకపోయేటప్పటికి మరింత ఆవేదన చెందారు. స్థానిక వేణుగోపాల నగర్‌లో ఈ సంఘటన జరిగింది. స్థానిక అభ్యర్థి ఒకరు 1280 మంది ఓటర్లను డబ్బుతో మభ్యపెట్టాడు. …