భారత క్రికెట్‌లో మరో వాల్.. పుజారా
భారత టెస్ట్ క్రికెట్‌లోకి మరో రాహుల్ ద్రవిడ్ అవతరించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చటేశ్వర్ పుజారా ఫామ్ చూస్తే ఇదే అనిపిస్తుంది. సిరీస్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు చేశాడు. నాలుగో టెస్ట్‌లో 7 పరుగుల దూరంలో ఔటై డబుల్ సెంచరీ చాన్స్ మిస్సయ్యాడు. అయితే సెంచరీల కంటే పుజారా ఓపిక, సహనం, ఆడిన తీరు ప్రశంసనీయం. లోక్‌శ్ రాహుల్ పూర్ ఓపెనింగ్ లతో క్రికెట్ అభిమానులు అసహనంతో విసుగుచెందిన సమయంలో పుజారా వారిని సంతృప్తి పరుస్తున్నాడు. …