విగ్రహాలూ… వర్థిల్లండి
దేశంలో రాజకీయ నాయకులకు విగ్రహాల పిచ్చి బాగా ముదురుతున్నట్టు కనిపిస్తుంది. వేలకోట్ల రూపాయలు వెచ్చించి విగ్రహాలు కట్టడానికి రాజకీయ నాయకులు పోటీపడుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం, వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడం తప్పనిసరి. చాలా అవసరం కూడా. కానీ దీనికి వేలకోట్లు ప్రజాధనం ఖర్చుచేసి విగ్రహాలు కడితే సరిపోతుందా? రైతు రుణమాఫీలపై సవాలక్ష లెక్కలు చూపిస్తూ వెనుకంజ వేస్తున్న ప్రభుత్వాలు విగ్రహాలకు వేలకోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టడం మంచిదేనా? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బీజేపీ ప్రభుత్వం రూ.2989 …