యాంకర్ శ్వేతా రెడ్డికి కేఏ పాల్ ఝలక్
హిందూపురం నుంచి బాలకృష్ణ మీద పోటీ చేయడానికి సిద్ధమైన జర్నలిస్టు, యాంకర్ శ్వేతారెడ్డికి ప్రజా శాంతి పార్టీ అధినేత, మత ప్రచారకుడు కేఏ పాల్ ఝలక్ ఇచ్చారు. ఇటీవలే కేఏ పాల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్వేతారెడ్డి కూడా పాల్గొంది. ఆ సందర్భంగా జరిగిన సంభాషణలో శ్వేతారెడ్డిని పార్టీలోకి కేఏ పాల్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏకంగా బాలకృష్ణ మీద పోటీ చేయడానికి హిందూపురం టికెట్ కూడా ఇచ్చినట్టు శ్వేతా రెడ్డి ప్రచారం చేసుకున్నారు. అలా రెండ్రోజులు …