National Politics

చంద్ర‌బాబు పొత్తుల వ్యూహం బెడిసికొట్టిన‌ట్టేనా?

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మాయావ‌తి, అఖిలేష్ యాద‌వ్ పొత్తు, సీట్ల పంపిణీ ప్ర‌క‌ట‌న‌తో చంద్ర‌బాబు ఫ్రంట్ ప్ర‌యత్నాల‌కు ఒక‌ర‌కంగా దెబ్బ‌ప‌డిన‌ట్టే. ఎన్నిక‌ల ముందే ఫ్రంట్‌గా ఏర్ప‌డి బీజేపీకి వ్య‌తిరేకంగా పోటీ చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌తో చంద్ర‌బాబు నాయుడు దేశంలోని ప్ర‌ముఖ బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌ను, నాయ‌కుల‌ను కొంత‌కాలంగా క‌లుస్తున్నారు. అయితే అనేక పార్టీలు ఎన్నిక‌ల ముందు పొత్తుకు అంత సుముఖంగా లేక‌పోవ‌డం చంద్రబాబు ప్ర‌య‌త్నాల‌ను ముందుకు సాగ‌నివ్వ‌డం లేదు. 80 లోక్‌స‌భ సీట్ల‌తో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో ఎస్పీ, …

చంద్ర‌బాబు పొత్తుల వ్యూహం బెడిసికొట్టిన‌ట్టేనా? Read More »

కేసీఆర్‌కు దీదీ షాక్‌… బీజేపీ వ్య‌తిరేక ర్యాలీకి చంద్ర‌బాబుకు ఆహ్వానం

కాంగ్రెస్‌, బీజేపీ ఏత‌ర ఫ్రంట్ కోసం కేసీఆర్ జాతీయ స్థాయిలో చేస్తున్న ప్ర‌య్న‌తాల‌కు పెద్ద షాకే త‌గిలింది. ఇప్ప‌టికే కేసీఆర్ ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని రెండు సార్లు క‌లిశారు. 2018లో ఒక‌సారి, మొన్న ముఖ్య‌మంత్రి అయ్యాక మ‌రోసారి క‌లిశారు. అయితే దీదీ మాత్రం జ‌న‌వ‌రి 19న కోల్‌క‌తాలో నిర్వ‌హించ‌నున్న ప్ర‌తిప‌క్షాల ర్యాలీకి కేసీఆర్‌ను కాకుండా చంద్ర‌బాబు నాయుడును ఆహ్వానించింది. ఈ ర్యాలీకి బీజేపీకి వ్య‌తిరేక పార్టీల‌న్నీ హాజ‌ర‌వుతుండ‌టం విశేషం. ఇందులో ఎస్పీ అఖిలేష్ యాద‌వ్‌, …

కేసీఆర్‌కు దీదీ షాక్‌… బీజేపీ వ్య‌తిరేక ర్యాలీకి చంద్ర‌బాబుకు ఆహ్వానం Read More »

సీబీఐ గొడ‌వ‌ల కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్‌

సీబీఐలో అంత‌ర్గ‌త గొడ‌వ‌ల‌కు సంబంధించిన కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ డైరెక్ట‌ర్ అలోక్ వ‌ర్మ‌ను బ‌లవంతంగా సెల‌వుపై పంపిన కేంద్రానికి, ఆ అధికారం లేదంటూ మ‌ళ్లీ అలోక్ వ‌ర్మ‌ను సీబీఐ డైరెక్ట‌ర్‌గా నియ‌మించింది. స్పెష‌ల్ డైరెక్ట‌ర్ ఆస్థానా, అలోక్ వ‌ర్మ మ‌ధ్య విభేదాల కార‌ణంగా కేంద్రం ఆ మ‌ధ్య ఇద్ద‌రినీ సెల‌వుపై పంపించింది. అయితే అలోక్ వ‌ర్మ త‌న తొల‌గింపు చెల్లదంటూ సుప్రంకోర్టును ఆశ్రయించారు. వాద‌న‌ల త‌ర్వాత సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. …

సీబీఐ గొడ‌వ‌ల కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్‌ Read More »