National Politics

ఆ 300 మంది తీవ్ర‌వాదుల శవాలు ఏవీ?

బాలాకోట్‌లో భార‌త వాయుసేన దాడిలో 300కుపై తీవ్ర‌వాదులు చ‌నిపోయి ఉంటార‌ని భార‌త్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దాని త‌ర్వాత పాకిస్తాన్ ప్ర‌తిదాడికి దిగ‌డం, మ‌న విమానాలు తిప్పికొట్ట‌డం, అభినంద‌న్ పాకిస్తాన్ సైన్యానికి దొర‌క‌డం, విడుద‌ల‌… ఇవ‌న్నీ ఒక‌దానివెంట మ‌రొక‌టి చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. కానీ చాలా మందిని వేధిస్తున్న ప్ర‌శ్న‌… భార‌త వైమానిక దాడిలో చ‌నిపోయిన‌ట్టుగా చెబుతున్న తీవ్ర‌వాదుల శ‌వాలు ఏమ‌య్యాయి? 300 మందికిపైగా చ‌నిపోతే క‌నీసం ఒక్క శ‌వ‌మైనా క‌నిపించ‌కుండా ఎలాపోతాయి? దాడులను వీడియో తీసిన‌ట్టే దాడి త‌ర్వాత …

ఆ 300 మంది తీవ్ర‌వాదుల శవాలు ఏవీ? Read More »

ఆరువేల‌తో రైతుల‌కు మోదీ గాలం

ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రైతుల‌ను ఆక‌ర్షించ‌డానికి తంటాలు ప‌డింది. ఒక‌వైపు రాహుల్ గాంధీ రుణ మాఫీలు, క‌నీస ఆదాయ ప‌థ‌కం అంటూ ఒత్తిడి తెస్తుండ‌టంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం సంక్షేమం బాట ప‌ట్టింది. తెలంగాణ‌లోని న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం త‌ర‌హాలో రైతుల‌కు నేరుగా ఆర్థిక స‌హాయం చేసే ప‌థ‌కాన్ని బడ్జెట్‌లో ప్ర‌క‌టించింది. ప్ర‌ధాన మంత్రి కిసాన్ యోజ‌న పేరుతో ఏటా రూ.6000 రైతుల‌కు ఆర్థిక సహాయం అందించ‌నుంది. ఈ ప‌థ‌కం దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతుంది. …

ఆరువేల‌తో రైతుల‌కు మోదీ గాలం Read More »

యూపీలో సాధువుల‌కు రూ.500 పించ‌ను

కుంభ‌మేళా సంద‌ర్భంగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బీజేపీ ప్ర‌భుత్వం అత్యంత వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది. యూపీలోని 60 ఏళ్లు పైబ‌డిన సాధువుల‌కు పించ‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. నెల‌కు రూ.500 చొప్పున వీరికి పించను ఇవ్వ‌నున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం ద్వారా హిందువుల ఓట్ల‌ను ఆక‌ర్షించ‌డానికి యోగీ ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. కుంభ‌మేళా సంద‌ర్భంగా ల‌క్ష‌ల సంఖ్య‌లో సాధువులు ప్ర‌యాగ‌రాజ్ (అల‌హాబాద్‌) సంద‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న‌దే అని …

యూపీలో సాధువుల‌కు రూ.500 పించ‌ను Read More »