వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాకి టైటిల్ కష్టాలు
ప్రజల్లో వస్తోన్న సామాజిక చైతన్యాన్ని సినిమావా వాళ్లు ఇంకా గుర్తించినట్టు కనిపించడం లేదు. సినిమా టైటిళ్లు, పాటలు, డైలాగుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నటు కనిపించడం లేదు. ఏదో ఒక వివాదం ద్వారా పబ్లిసిటీ తెచ్చుకోవడం కూడా ఒక వ్యూహమే అయినప్పటికీ, ఇది సినిమా రంగంలో కొరవడిన సామాజిక స్పృహను కూడా తెలియజేస్తుంది. ఆ మధ్య మన్మధుడు సినిమాలో నాగార్జున మీటింగ్‌కు సంబంధించి వాడిన డైలాగులో తమను కించకరిచారంటూ ఒక సామాజిక వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. …