రాజమౌళి RRR సినిమాకి ప్రేరణ రామాయణమా?
బాహుబలి బంపర్ హిట్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి. సినిమా టైటిల్, నటీనటులను చూస్తే కథ ఒక పట్టాన అర్థం కావట్లేదని అభిమానులు జుట్లు పీక్కుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం RRR కి ప్రేరణ రామాయణం అంటున్నారు సినీ వర్గాలు. రాజమౌళికి ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా మహాభారతం సినిమాగా తీయాలని తన లక్ష్యంగా చాలాసార్లు చెప్పాడు కూడా. …