పవన్ కళ్యాణ్ పయనం ఎటువైపు..?
పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. ఇతర పార్టీల్లో పేరున్న నేతలను పార్టీలో చేర్చుకోవడంపై ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు ఉంది. పొత్తులపై ఎక్కడా మాట్లాడటం లేదు. పొత్తుల కంటే ముందు జనసేన బలమైన పార్టీ అనే ఇమేజ్‌ని క్రియేట్ చేయడం పవన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. దీనివల్ల ఒకవేళ పొత్తు పెట్టుకుంటే మరిన్ని సీట్లు లభించే అవకాశం ఉంటుంది. పొత్తుల విషయంలో పవన్‌కు ఉన్న అవకాశాలు ప్రస్తుతం పరిమితమే. ఒంటరిగా …