చంద్రబాబుతో మోదీ అమీ తుమీ
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఏపీ పర్యటనలో భాగంగా ప్రజాచైతన్య సభలో మాట్లాడిన నరేంద్ర మోదీ చంద్రబాబుపై నేరుగానే విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ పనితీరుపైనేగాక చంద్రబాబును వ్యక్తిగతంగా కూడా ప్రధాని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చంద్రబాబు సీనియారిటీ గురించి అనేక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికిపోయినా చంద్రబాబు నాకంటే సీనియర్ అని చెప్పుకుంటున్నారు… నిజమో.. మామను వెన్నుపోటు పొడవడంలో, కొడుకు కోసం అవినీతికి పాల్పడటంలో నాకంటే చంద్రబాబు సీనియర్ …