ఝాన్సీ ఫోన్‌లో సమాచారం మాయం..?
సినిమా, టీవీ రంగాలకు చెందిన తారలు ఇటీవల కాలంలో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమ వ్యవహారాలే వీటికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. పేద కుటుంబం నుంచి హైదరాబాద్ వచ్చి టీవీ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ బలవన్మరణం తాజాగా అందరినీ కలచివేసింది. ఆమె తల్లిదండ్రులు సాధారణ రైతు కూలీలు. బతుకుదెరువు కోసం మూడేళ్ల కిందట వచ్చి తక్కువ కాలంలో నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ప్రేమ రూపంలో ఆమెను విధి కాటేసింది. ఝాన్సీకి ఏడాది కిందట …