రిటర్న్ గిఫ్టుపై కేసీఆర్ వెనుకంజ?
తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఏపీ రాజకీయాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. తెలంగాణకు వచ్చి టీఆర్ ఎస్‌ను ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని కేసీఆర్ ఆనాడు చెప్పారు. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి టీఆర్ ఎస్ నాయకులు చంద్రబాబు ఓటమికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే ప్రధాన లక్ష్యంగా …