టీమ్ జగన్.. మంత్రులుగా ఎవరికి ఛాన్స్?
వైఎస్ జగన్‌తోపాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఏయే ప్రాంతాలకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. 151 స్థానాలు గెలవడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలువురు సీనియర్లు, జూనియర్లు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. జగన్ రాయలసీమలోని పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున కోస్తా, ఉత్తరాంధ్రల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా …