వినయ విధేయ రాజకీయం
బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ నటించిన వినయ విధేయ రామ ఆడియో రిలీజ్ వేడుకలో అనేక రాజకీయ సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఆడియో ఫంక్షన్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం, ఆ సందర్భంగా మాట్లాడుతూ తాను ఈ మధ్య పవన్ కళ్యాణ్‌తో రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ తప్పకుండా జోక్యం చేసుకుంటుందని గతంలో కేటీఆర్ చెప్పడం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అయితే …