Andhra Politics

కేంద్రం జోక్యంతో… కోడి క‌త్తి కేసు కీల‌క మ‌లుపు

వైజాగ్ విమానాశ్ర‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కోడి క‌త్తితో దాడి జ‌రిగిన కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ కేసు విచార‌ణ‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బ‌దిలీ చేస్తూ ఏపీ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన ప్ర‌దేశం కేంద్ర ప‌రిధిలోకి వ‌స్తుంది కాబ‌ట్టి కేంద్ర సంస్థ చేత విచార‌ణ జ‌రిపించాల‌ని జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర‌డంతో హైకోర్టు దీనికి అంగీక‌రించింది. మ‌రోవైపు ఎన్ఐఏ ఈ కేసులో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం …

కేంద్రం జోక్యంతో… కోడి క‌త్తి కేసు కీల‌క మ‌లుపు Read More »

ఏలూరు, క‌డ‌ప‌, ఒంగోలుకు మ‌హ‌ర్ద‌శ‌

ప‌ట్ట‌ణాల‌ను అభివృద్ధి చేయ‌డంలో భాగంగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు హైద‌రాబాద్ మీద పూర్తిగా దృష్టి కేంద్రీక‌రించ‌డంతో ఏపీలోని చాలా జిల్లా కేంద్రాలు, ఇత‌ర ప‌ట్ట‌ణాలు అభివృద్ధికి నోచుకోలేదు. కొత్త రాష్ట్రంలో జిల్లాల అభివృద్ధిపై మ‌రింత దృష్టిపెట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఒంగోలు, క‌డ‌ప‌, ఏలూరుల‌ను అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీలుగా మారుస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒంగోలు అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (ప్ర‌కాశం): ఇందులో అర్థ‌వీడు, కంభం, రాచ‌ర్ల‌, గిద్ద‌లూరు, కొమ‌రోలు, …

ఏలూరు, క‌డ‌ప‌, ఒంగోలుకు మ‌హ‌ర్ద‌శ‌ Read More »

చంద్ర‌బాబు, ప‌వ‌న్ దోస్తీ నిజ‌మేనా?

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్న‌ట్టు సంకేతాలు అందుతున్నాయి. ఎన్నిక‌ల స‌మీపిస్తుండ‌టంతో రాజ‌కీయ పార్టీలు, నాయ‌కులు పూర్తిగా ఆచ‌ర‌ణాత్మ‌క దృక్ప‌థంలో ముందుకు పోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టీడీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య చిగురిస్తున్న పొత్తు చ‌ర్చనీయాంశంగా మారింది. ఇది నిజమే అన్న‌ట్టుగా గ‌త కొంత‌కాలంగా టీడీపీ, చంద్ర‌బాబు నాయుడు, లోకేష్‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద‌గా విమ‌ర్శ‌లు సంధించ‌డం లేదు. తెలుగుదేశం నాయ‌కులు కూడా ఎక్కువ‌గా జ‌గ‌న్‌నే టార్గెట్ చేస్తున్నారు. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌ట్లో చంద్ర‌బాబు, …

చంద్ర‌బాబు, ప‌వ‌న్ దోస్తీ నిజ‌మేనా? Read More »