పట్టణాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు హైదరాబాద్ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతో ఏపీలోని చాలా జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలు అభివృద్ధికి నోచుకోలేదు. కొత్త రాష్ట్రంలో జిల్లాల అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఒంగోలు, కడప, ఏలూరులను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలుగా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ప్రకాశం):
ఇందులో అర్థవీడు, కంభం, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, బేస్తవారిపేట, వెలిగండ్ల, మార్కాపురం, పామూలు, తర్లుబాడు, దొనకొండ, కొనకనమిట్ల, కనిగిరి, పొదిలి, కురిచేడు, దర్శి, నూజెండ్ల, వినుకొండ, సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, అద్దంకి, జే.పంగూలూరు, కొరిశపాడు, మద్దిపాడు, చీమకుర్తి, ఎస్ ఎస్ పాడు, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, జరుగుమిల్లి, కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు మండలాలు కలవనున్నాయి.
అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడప):
ఇందులో కలిసే మండలాలు – చాపాడు, కాజీపేట్, కోడూరు, రామాపురం, సంబేపల్లి, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, బి.కోడూరు, బద్వేల్, మ.మాటం, చిట్వేలి, దువ్వూరు, గోపవరం, జమ్మలమడుగు, కలశపాడు, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, నందలూరు, ఓబులవారిపల్లి, పోరుమామిళ్ల, పులివెందుల, రాజంపేట, ప్రొద్దుటూరు, పుల్లంపేట, రాజుపాలెం, కాశినాయన, రాయచోటి, సిద్దవటం, ఎస్.మైదుకూరు, వల్లూరు, తొండూరు, వేముల, వీరబల్లి, పెండ్లిమర్రి, ఒంటిమిట్ల, యర్రగుంట్ల.
ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏలూరు – పశ్చిమ గోదావరి):
ఇందులో దెందులూరు, పెదపాడు, పెనుగొండ, తణుకు, వుండ్రాజవరం, ఆచంట, అత్తిలి, యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, వీరవాసరం, పోడూరు, పెనుమంట్ర, ఇరగవరం మండలాలు పూర్తిగా కలవనున్నాయి. భీమడోలు, చాగల్లు, ద్వారకా తిరుమల, పెరవలి, పెంటపాడు, పెదవేగి, నిడదవోలు, కొవ్వూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, కామవరపుకోట, ఆకివీడు, భీమవరం, మొగల్తూరు, జంగారెడ్డిగూడెం, ఉండి, పాలకోడేరు, గనపవరం, కాళ్ల, టి. నర్సాపురం మండలాల్లోని కొన్ని గ్రామాలు ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో కలవనున్నాయి.