కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటన

ముఖ్యాంశాలు:

  • కడప నగరంలో విస్తృతంగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా.
  • కడప జడ్పీ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ , మునిసిపల్ మైదానం లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ పరిశీలించిన అంజాద్ బాషా. కరోనా నేపథ్యంలో ప్రజలను పలు సూచనలు.

కడప నగరంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటించారు. కూరగాయల కొనుగోలుకు నగరంలోని మార్కెట్లకు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచనలు చేశారు. అంతేగాకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు అంజాద్ బాషా.

ఉప ముఖ్యమంత్రి తానే స్వయంగా కరోనా వైరస్ ప్రబలకుండా రోడ్ల పై హైడ్రోలైస్ మందును పిచికారీ చేసి రోడ్లపై చల్లడం విశేషం. పర్యటనలో భాగంగా పేద ప్రజలకు అందించే రేషన్ సరుకులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.

అలాగే పేద ప్రజలకు ఉచితంగా బియ్యం తో పాటు కందిపప్పు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అంజాద్ భాషాతోపాటు మాజీ మేయర్ సురేష్ బాబు, కమిషనర్ లవన్న, ఆర్డీఓ మలోలా కూడా కడప నగరంలో పర్యటించారు.

@ Hello AP, 29 March 2020.