ఏపీలో కొనసాగుతున్న ఉచిత రేషన్ పంపిణీ

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ కొనసాగుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుండి ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది. రేషన్ షాపుల వద్ద బారులు తీరిన ప్రజానీకం బట్టి ప్రజలు కనీస అవసరాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ ప్రభావం వల్ల ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది.

అలాగే రేషన్ కోసం వచ్చిన ప్రజలు మాస్కులు కట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది.

రేషన్లో భాగంగా ప్రభుత్వం బియ్యంతో పాటు కేజీ కంది పప్పు ని కూడా ఇస్తున్నట్టు తెలిపింది. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో రేషన్ పంపిణీ జరుగుతుంది. కరోనా దృష్ట్యా తంబ్ కు వెసులుబాటు కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. తంబ్ అధారిటీ ని సచివాలయ సిబ్బంది కి ప్రభుత్వం అప్పగించింది.

@ Hello AP, 29 March 2020